న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులలో గూగుల్ పేను, ఫోన్‌పే అధిగమించి డిసెంబర్‌లో టాప్ యూపీఐ యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి.
కాగా జీపేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్‌పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రెండు యాప్‌లు మొత్తం 4,16,176.21 కోట్ల యుపిఐ లావాదేవీల వాల్యూమ్‌లో 86 శాతానికి పైగా ఉన్నాయి.
ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం, ఫోన్‌పే డిసెంబరులో లావాదేవీ విలువ గత నెల లావాదేవీల విలువతో పోల్చితే 3.87(868.4 మిలియన్) శాతం పెరుగుదల కనిపించింది. అలాగే, నవంబర్‌లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది.