టాలీవుడ్: కెరీర్ మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండే పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ శౌర్య. ‘చలో’ సినిమా హిట్ తర్వాత కమర్షియల్ ఇమేజ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. చివరగా తాను నటించిన ‘అశ్వద్దామ’ సినిమా పరవాలేదని పించింది. లాక్ డౌన్ టైం లో చాలా కథలని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వరుసగా సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్ లలో బిజీ గా ఉన్నాడు నాగ శౌర్య. ప్రస్తుతం ‘లక్ష్య’ అనే స్పోర్ట్స్ బేస్డ్ కథలో, ‘వరుడు కావలెను’ అనే రొమాంటిక్ ఫామిలీ డ్రామా కథతో ఇలా రక రకాల జానర్ లలో నటిస్తున్నాడు. వీటితో పాటు ఈరోజు మరొక సినిమా ప్రకటించాడు ఈ యువ హీరో.
‘పొలిసు వారి హెచ్చరిక’ అనే సినిమా టైటిల్ ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసాడు నాగ శౌర్య. దీన్ని బట్టి ఈ సినిమాలో నాగ శౌర్య పోలీస్ రోల్ చేస్తున్నాడా అని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా ఒక సిటీ లో జరిగే పోలీస్ కథ అని అర్ధం అవుతుంది. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నాగ శౌర్య మరో సారి నటించనున్నట్టు హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిఖర కోనేరు సమర్పణలో మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కే. పి. రాజేంద్ర అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొత్తంగా చూస్తే ఈ సినిమాతో కలిపి నాగ శౌర్య హీరోగా ఈ సంవత్సరంలో మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.