శాండల్ వుడ్: ఈగ సినిమాలో విలన్ గా నటించి టాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కన్నడ టాప్ హీరో కిచ్చా సుదీప్. చివరగా తాను నటించిన ‘పహిల్వాన్’ అనే సినిమాను కూడా తెలుగులో కూడా విడుదల చేసాడు. ప్రస్తుతం సుదీప్ ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఇన్నిరోజులు ‘ఫాంటమ్’ అనే పేరుతో తెరకెక్కించారు, కానీ ఇపుడు ఈ సినిమా పేరు మారుస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సినిమా పేరు మార్చడానికి కారణం మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘విక్రాంత్ రోనా’ అనే కొత్త టైటిల్ ప్రకటించారు.
ఒక అద్భుతమైన కథతో టెక్నీకల్ మెలకువలతో ఈ సినిమా సినీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని ఈ సినిమా గురించి చాలా టాల్క్స్ వినిపించాయి. ఒక షో లో నాగార్జున కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడు. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ లోగో మరియు టీజర్ ని ఈ నెల 31 న విడుదల చేయనున్నట్టు కూడా తెలిపారు. మరొక విశేషం ఏంటంటే ఇంతవరకు ఏ సినిమాకి చేయని ఫీట్ ఈ సినిమాకి చెయ్యనున్నారు. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా పైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని మరియు 180 సెకెన్ల టీజర్ని ప్రెసెంట్ చేయనున్నారు. ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఈ సినిమాకే మొదటిది అవడం విశేషం.