లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు ఆసీస్ ను 2-1తో ఓడించి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు అభిమానులు ఘన స్వాగతాం పలికారు. ఆసీస్‌పై అధ్బుతమైన విక్టరీ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది.
ఈ సదర్భంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన గ్రేమ్ స్వాన్ ఇంగ్లండ్ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఇదే నా హెచ్చరిక, రానున్నది కఠినమైన సిరీస్, ఎందుకంటే టీమిండియా ఎప్పుడూ స్వదేశంలో సింహంలా గర్జిస్తుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆ జట్టు ఇంకా బలంగా ఉంటుంది. ఎప్పుడో జరిగే యాషెస్ సిరీస్‌ను పక్కనబెట్టి టీమిండియాతో జరిగే సిరీస్ గురించి ఆలోచించండి.
సమయాన్ని వృథా చేయకుండా, భారత్‌ను ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి పెడితే మంచిది. 2012 తర్వాత మనం టీమిండియాను వారి గడ్డపై ఓడించలేక పోయాం, టీమిండియా పిచ్ లు స్పిన్నర్లకు స్వర్గధామం, కాబట్టి రానున్న సిరీస్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి, బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడితే తప్ప భారత్‌పై గెలవడం అసాధ్యం అని తెలిపాడు.
ఇంగ్లండ్ జట్టు పర్యటన వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా జరగనుంది.