టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నాడు. నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా దాదాపు అన్ని సినిమాల అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. నాగ శౌర్య తన 19 వ సినిమాగా తనకి మొదటి సక్సెస్ ఇచ్చిన ‘శ్రీనివాస్ అవసరాల’ దర్శకత్వంలో ‘పలానా అమ్మాయి పలానా అబ్బాయి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శౌర్య కి జోడీ గా ‘మాళవిక నాయర్’ నటిస్తుంది. వీళ్లిద్దరి జోడి లో ఇది రెండవ సినిమా. శౌర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
నాగ శౌర్య ప్రస్తుతం నటిసున్న సినిమాల్లో మరో క్లాస్ సినిమా ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో నాగ శౌర్య కి సంబందించిన ఒక షార్ట్ వీడియో విడుదల చేసారు. శౌర్య అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఒక రిచ్ కుర్రాడిలా ఈ సినిమాలో కనిపించనున్నాడని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో శౌర్య కి జోడీ గా రీతూ వర్మ నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. లక్ష్మి సౌజన్య అనే నూతన దర్శకురాలు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీడియో లో విశాల్ చంద్ర శేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.