అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలజ్ విషయంలో పూటకో సంచలనాలు, ఉట్కంఠ రూపంలో ఎప్పుడూ ఏ ఎన్నికలకు లేని ప్రాచుర్యం పొందుతోంది. ఎస్ఈసీ పట్టు ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వ పట్టు ఒక వైపు, నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో ఎట్టకేలకు ఎస్ఈసీ నే పై చేయి సాధించింది.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్ పంపాల్సిందిగా ఎస్‌ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, వారు ఇచ్చిన ప్యానెల్ లో ఎస్‌ఈసీ సూచించిన వారినే ఆ స్థానాల్లో విధుల్లో నియమించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో జారీ కావాల్సి ఉందని తెలుస్తోంది.