టాలీవుడ్: రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యాక పవన్ కళ్యాణ్ సినిమాలు తియ్యడం లో చాలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు 4 సినిమాలు ప్రకటించాడు. అందులో వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేసాడు. క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కూడా కొంత షూటింగ్ చేసారు. ఇప్పుడు రానా తో కలిసి నటించబోతున్న మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ రీమేక్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు‘ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచన సహకారం మరియు డైలాగ్స్ రాయనున్నాడు.
ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. తన తదుపరి సినెమాలన్నిటిలో చివర్లో ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ మాత్రం అన్నిటికన్నా ముందుగా మొదలైంది. దాదాపు నెల రోజుల కాల్షీట్లలో ఈ సినిమా ముగించి ఈ సంవత్సరం లోనే ఈ సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అండ్ టీం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి.డి.వీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కంపోజర్ ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.