టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టేజ్ లో ఫ్యాక్షన్ సినిమాలు, ఒక స్టేజ్ లో లవ్ స్టోరీలు, ఒక స్టేజ్ లో థ్రిల్లర్లు, ఒక స్టేజ్ లో కామెడీ థ్రిల్లర్లు , ఒక స్టేజ్ లో బయోపిక్ ల హడావిడి నడిచింది. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాల హంగామా నడుస్తుంది. చిన్న హీరోల దగ్గరి నుండి పెద్ద హీరోల వరకు చాల మంది ప్రస్తుతం స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోల్లో టాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ‘లైగర్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమా రూపొందుతుంది.
మరో యువ నటుడు, మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ‘గని’ అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా లో నటిస్తున్నాడు. ఇది కూడా బాక్సింగ్ నేపథ్యం లోనే సాగుతుంది. కానీ ఈ సినిమాలో ఇండియా లో బాక్సింగ్ ఎందుకు పట్టించుకోవడం లేదు లాంటి అంశాలని చూపించబోతున్నట్టు టాక్ ఉంది. ఇవే కాకుండా సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ సినిమా ఐన 25 వ సినిమాని నేషనల్ స్పోర్ట్ హాకీ నేపధ్యం లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా హాకీ ఎందుకు వెనుకబడుందో కొన్ని సీన్స్ ట్రైలర్ ద్వారా చూపించారు. శౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో ‘లక్ష్య‘ అనే సినిమా రూపొందుతుంది. బాడ్మింటన్ ఆటకి సంబందించిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. గోపీచంద్ , తమన్నా కోచ్ లుగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీ మార్’ అనే సినిమా హాకీ నేపథ్యంలో రూపొందుతుంది. ఇలా దాదాపు ఒక అర డజను సినిమాలు ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి. ఈ సినిమాలన్నీ దాదాపు ఈ సంవత్సరంలోనే విడుదల అవుతాయి.