టాలీవుడ్: అక్కినేని హీరో సుశాంత్ హీరో గా నిలదొక్కుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. చి.ల.సౌ అనే సినిమా ద్వారా మొదటి హిట్ కొట్టిన ఈ హీరో ‘అల వైకుంఠపురం లో’ ఒక పాత్రలో మెరిశాడు. చాలా రోజల తర్వాత ‘ఇచట వాహనములు నిలపరాదు – NO PARKING ‘ అనే సినిమాతో మళ్ళీ పలకరించనున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ని రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేయించారు. ఏ1 స్టూడియోస్ , శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ సినిమాని నిర్మించారు. ఎస్.దర్శన్ అనే దర్శకుడు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.
‘నా లైఫ్ లో అమ్మ కి, అమ్మాయి కి, బైక్ కి అవినాభావ సంబంధం ఉంది’ అనే డైలాగ్ తో టీజర్ ఆరంభం అయింది. టీజర్ మొత్తం లో బైక్ పైన్నే ఎక్కువ ఫోకస్ చేసారు. టైటిల్, టీజర్ ని బట్టి చూస్తే సినిమా మొత్తం బైక్ చుట్తోనే తిరిగినట్టు అనిపిస్తుంది. ఇదివరకు వరుణ్ సందేశ్ కూడా ‘కుర్రాడు’ అనే సినిమా కూడా ఇలాంటి థీమ్ తోనే చేసాడు. ఇలాంటి సినిమాలు గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే తో ఆకట్టుకుంటాయి. మరి ఈ సినిమాలో అది ఎంతవరకు వర్కౌట్ ఐతుందో చూడాలి. ఈ సినిమాలో రన్ రాజా రన్ కమెడియన్స్ , వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, ప్రియదర్శి నటించడం చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల ప్రకటించే వీలుంది.