టాలీవుడ్: దగ్గుబాటి హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నారప్ప’. ధనుష్ హీరోగా తమిళ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘అసురణ్’ కి రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. చాల రోజుల తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్. థాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి విలేజ్ రోల్ లో వెంకీ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఊళ్లలో ఉండే రైతు పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
వూరిలో ఉండి తన పని తను చేసుకుంటూ మర్యాదగా గడిపే ఒక రైతు నారప్ప.. కొన్ని పరిస్థితుల వలన నారప్ప తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రివెంజ్ బాట పట్టాల్సివస్తుంది. ఆ పరిస్థితులు ఏంటి చివరకి ఏం జరుగుతుంది అనేది నారప్ప కథ. ఈ సినిమాని మండు వేసవి లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. 14 మే న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్య గా ప్రియమణి నటిస్తుంది. మరిన్ని పాత్రల్లో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళి శర్మ నటిస్తున్నారు.