న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్దేశించిన ధరలకు కోవిడ్-19 సోకిన రోగులకు చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నారా అని సుప్రీంకోర్టు, శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రులను అడిగింది. దేశంలోని పేద, బలహీన వ్యక్తులకు ఆరోగ్య రక్షణ కల్పించడమే ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన యొక్క లక్ష్యం.
చీఫ్ జస్టిస్ ఎస్ ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం, అన్ని ప్రైవేటు ఆసుపత్రులను నిర్దిష్ట సంఖ్యలో కోవిడ్-19 రోగులకు ఉచితంగా చికిత్స చేయమని కోరడం లేదు. జస్టిస్ ఎ ఎస్ బోపన్న మరియు హృషికేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం, ప్రభుత్వం రాయితీ రేటు అనుమతిచ్చిన ప్రైవేటు ఆసుపత్రులను మాత్రమే నిర్దిష్ట సంఖ్యలో కరోనావైరస్ సోకిన రోగులకు ఉచితంగా చికిత్స చేయమని అడుగుతున్నట్లు తెలిపింది.
ఆయుష్మాన్ రేట్లకు చికిత్స చేయడానికి ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను? అని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచారణ సందర్భంగా సిజెఐ అడిగారు. సమాజంలోని అత్యల్ప వర్గాలకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని, చికిత్స తీసుకోలేని ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వస్తారని, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.