fbpx
Sunday, December 29, 2024
HomeInternationalఅమెరికాలో మహాత్మ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం

అమెరికాలో మహాత్మ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం

GANDHI-STATUE-DESTROYED-IN-AMERICA

న్యూఢిల్లీ: భారత్ అమెరికాకు బహుమానంగా ఇచ్చిన ఒక జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేతపై భారత్ తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది అత్యంత హేయమైన చర్య అని తెలిపింది.

ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికాలోని డేవిస్‌ పట్టణంలో జనవరి 27వ తేదీన గుర్తు తెలియని కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది.

అంతర్జాతీయంగా శాంతి, సమానత్వానికి ప్రతీకకు మారుపేరు గా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం కూల్చివేత హేయమైన చర్య అని భారత్‌ పేర్కొంది. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని డేవిస్‌ మేయర్‌ ప్రకటించారు.

కాగా, 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు‌ బహుమతిగా ఇచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్‌ పట్టణంలోని సెంట్రల్‌ పార్క్‌లో దీనిని ప్రతిష్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular