టాలీవుడ్: RX100 సినిమా ద్వారా పరిచయం అయిన హీరో కార్తికేయ. తర్వాత కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు గీతా ఆర్ట్స్ వారి కాంపౌండ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్ళపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో కార్తికేయ కి జోడీ గా నటించింది. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో శవాలని తీసుకెళ్లే వెహికిల్ డ్రైవర్ గా హీరో నటిస్తున్నాడు. టీజర్ లో ఈ కారెక్టర్ తాలూకు పరిచయం మరియు కామెడీ కూడా కొంత ఆకట్టుకుంది. ఈ సినిమాని మార్చ్ 19 న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫుల్ కాంపిటీషన్ ఉన్న ఈ మార్చ్ నెలలో ఇప్పటి వరకైతే ఈ సినిమా సింగల్ గానే విడుదలవుతుంది. దీనికి ముందు వారం మార్చ్ 11 న మూడు సినిమాలు విడుదలవుతున్నాయి, తర్వాతి వారం మార్చ్ 29 న నితిన్ రంగ్ దే విడులవుతుంది. అల్లు అరవింద్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా బాగానే ఉంటుందని కొంచెం అంచనాలు ఉన్నాయి.