fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఆరంభం

Prabhas AdiPurushMovie ShootingStarted

బాలీవుడ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటించి షూటింగ్స్ మొదలు పెడుతున్నాడు. ఇందులో ‘తానాజీ’ డైరెక్టర్ ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో విలన్ గా రావాణాసురుని పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ముంబై లోని ఒక ప్రైవేట్ స్టూడియో లో ఈ రోజు పూజా కార్యక్రమాలు చేసి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

ఈ సినిమా ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడం తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు మోషన్ కాప్చర్ వర్క్ ఇదివరకే మొదలుపెట్టారు డైరెక్టర్. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా చాలా తొందరగా ముగించి 2022 సమ్మర్ వరకు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘సాలార్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మరో క్రేజీ సినిమాలో కూడా నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular