కోలీవుడ్: తమిళ స్టార్ హీరో శింబు బాడీ ని టోన్ చేసుకొని కొత్త రూపంలోకి వచ్చాక వరుస సినిమాలు చేస్తున్నాడు. సంక్రాంతి కి ‘ఈశ్వరన్’ అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా రొటీన్ కథతో యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ప్రస్తుతం ఈ హీరో ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని వేరే భాషల్లో ‘REWIND’ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. తమిళ్ లో స్టైలిష్ మూవీ మేకర్ గా పేరున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ విడుదల చేసారు.
టీజర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా ఉంది. టీజర్ లో చూపించిన అన్ని సీన్స్ లో శింబు ఉన్న సీన్స్ తప్ప మిగతా సీన్స్ అన్ని కాలంలో వెనక్కి వెళ్లే సన్నివేశాలే చూపించారు. REWIND అనే టైటిల్ కి తగ్గట్టు టీజర్ లో సీన్స్ అన్ని అలాగే చూపించారు. ‘కాలం ఎవరి కోసం వెయిట్ చెయ్యదు, ఒక వేల వెయిట్ చేస్తే’ అని శింబు ని టీజర్ లో చూపిస్తారు. బహుశా శింబు కి అలా ఏమైనా పవర్స్ ఉండేలా ఈ సినిమాలో ఉంటాడేమో చూడాలి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో శింబు తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, ఎస్.జె.సూర్య, ప్రేమ్ జీ నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వీ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్చ్ కామచి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.