టాలీవుడ్: 2020 లో తమిళ్ లో ‘ఓహ్ మై కడవులే’ అనే సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన హీరో ‘అశోక్ సెల్వన్‘ మరియు నిత్య మీనన్, రీతూ వర్మ ప్రధాన పాత్రలుగా ఒక సినిమా తెరకెక్కింది. ‘నిన్నిలా నిన్నిలా’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. పూర్తిగా ఊబకాయంతో మరియు కండరాల వ్యాధి తో ఉండే ఒక విచిత్రమైన పాత్రలో హీరో అశోక్ సెల్వన్ నటిస్తున్నాడు. మరొక చిన్న పిల్ల బుద్ది ఉండే పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుంది. అశోక్ సెల్వన్ ఒక వ్యాధి తో ఉన్నపటికీ మంచి చెఫ్. తన దగ్గర కో-చెఫ్ గ రీతూ వర్మ పాత్ర ఉండబోతుంది.
వీళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనలు, నిత్య మీనన్ మరియు అశోక్ సెల్వన్ ల ఫ్లాష్ బ్యాక్, లవ్, లైఫ్, కామెడీ ఇవి ముఖ్యంగా బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఒక స్మూత్ గా వెళ్లిపోయే సినిమా మరియు పూర్తి భావోద్వేగాలతో నిండి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తమిళ్ మరియు తెలుగులో రూపొందింది. ఇందులో మరిన్ని పాత్రల్లో కమెడియన్ సత్యరాజ్, నాజర్ నటించారు. ఎస్.వీ.సి.సి. క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో బి.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఐ.వీ.సాయి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రేమమ్ కి సంగీతం అందించిన రాజేష్ మురుగేషన్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ఈ సినిమాని ఫిబ్రవరి 26 న డైరెక్ట్ గ జీ-ప్లేస్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.