fbpx
Wednesday, January 15, 2025
HomeMovie Newsఅల్లరి నరేష్ 'నాంది' ట్రైలర్ విడుదల

అల్లరి నరేష్ ‘నాంది’ ట్రైలర్ విడుదల

AllariNaresh NaandiMovie TrailerReleased

టాలీవుడ్: ఈ సంవత్సరం జనవరి లో ‘బంగారు బుల్లోడు’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా విడుదల చేసి ప్లాప్ చవి చూసాడు అల్లరి నరేష్. ప్రస్తుతం ఈ హీరో ఫిబ్రవరి లో మరొక సినిమాతో మన ముందుకు రానున్నాడు. కానీ ఈ సినిమా తన రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్ లాగ కాకుండా ఒక పూర్తి సీరియస్ కథ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఒక ఈవెంట్ లో కూడా ఇక నుండి రెగ్యులర్ కామెడీ సినిమాలు తగ్గించి నటుడిగా మంచి గుర్తింపు అలాగే మంచి కథ ఉన్న సినిమాలే చేస్తానని చెప్పాడు. ఈ హీరో నటించిన ‘నాంది’ అనే సినిమా ఈ నెల 19 న విడుదల అవనుంది. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు.

సిటీ లో ఒక పెద్ద మనిషి హత్య చేయబడితే అమాయకుడైన నరేష్ ని ఆ హత్య కేసులో నిందితుడిగా జైలు లో వేస్తారు. పోలీసులకి ఈ విషయం తెల్సినా కూడా వేరే బడా బాబులని కాపాడడానికి ఎలాంటి బాగ్ గ్రౌండ్ లేని సాధారణ మధ్య తరగతి వ్యక్తి అయిన నరేష్ ని ఎలాగైనా ఆ హత్య చేసింది తానే అని ఒప్పుకోమని రక రకాలుగా శిక్షిస్తుంటారు. ఈ సినిమాలో నరేష్ కేసు వాదించే లాయర్ గా మరొక ప్రత్యేకమైన పాత్రలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ సినిమాని నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular