మాలీవుడ్: సౌత్ నుండి అతి కొద్ది మంది హీరోలు మాత్రమే పాన్ ఇండియా హీరోలుగా ఎదిగారు. ఇప్పుడున్న నటులలో ధనుష్ ఒక్కడే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేసి హిట్ కొట్టి బాలీవుడ్ లో కూడా కొంత క్రేజ్ సంపాదించాడు. ప్రభాస్ కూడా తెలుగు సినిమా బాహుబలి ద్వారానే బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కానీ డైరెక్ట్ హిందీ మూవీ తీసి హిట్ కొట్టలేదు. కానీ మలయాళ నటుడు దుల్కర్ మాత్రం కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా తమిళ్, తెలుగు లో కూడా డైరెక్ట్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా అడుగులు వేస్తున్నాడు.
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొత్త రకమైన సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా మొత్తం అభిమానుల్ని సంపాదించాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ చేసిన కొన్ని సినిమాలు వేరే రాష్ట్రాల్లో కూడా బాషా బేధం లేకుండా ఓటీటీల్లో చాలా వ్యూస్ వచ్చాయి. ఇదివరకే దుల్కర్ సల్మాన్ కి తమిళ్ లో కొంత క్రేజ్ ఉంది. తమిళ్ లో ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కోలయాదితల్’ సినిమాతో హిట్ కొట్టాడు. తెలుగు లో ‘మహానటి’ సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగు మూవీ లో నటించాడు. ఇపుడు ‘వైజయంతి మూవీస్’ వారి ‘లెఫ్ట్ నెంట్ రామ్’ సినిమాతో పూర్తి తెలుగు సినిమా చేస్తున్నాడు.
దుల్కర్ హిందీ లో ‘కార్వాన్’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు దాని తర్వాత సోనమ్ కపూర్ తో కలిసి ‘జోయా ఫాక్టర్’ అనే సినిమా తీసి హిట్ కొట్టి తాను బాలీవుడ్ హీరోగా సెట్ అవగలను అని నిరూపించుకున్నాడు. ఇపుడు ఆర్. బాల్కి దర్శకత్వంలో మరో హిందీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదే కాకుండా తమిళ్ లో ‘హే సినామిక’, మలయాళం లో ‘కురూపి’, ‘సెల్యూట్’ అనే సినిమాలు చేస్తూ అన్ని భాషలు కవర్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోబోతున్నాడు.