టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘నవీన్ పోలిశెట్టి’. ఈ నటుడు ప్రస్తుతం తన రెండవ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. మామూలుగానే టాలీవుడ్లో టాప్ కమెడియన్, మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్ ఎవరు అంటే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పేర్లు వినిపిస్తాయి. అలాంటి ఇద్దరు కమెడియన్స్ మరో సూపర్ టైమింగ్ ఉన్న నటుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో, అలాంటి సినిమా ఒక పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ఐతే ఎలా ఉంటుందో ‘జాతి రత్నాలు’ సినిమా టీజర్ చూస్తే తెలుస్తుంది.
వీళ్ళు ముగ్గురు ప్రధాన పాత్రల్లో ప్రఖ్యాత వైజయంతి మూవీస్ వారి స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ ‘నాగ్ అశ్విన్ ‘ నిర్మాణంలో ‘జాతి రత్నాలు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా టైటిల్, ఈ సినిమాలో జైలు లో వీళ్ళు ముగ్గురి ఖైదీ నంబర్లు (420 , 840 , 210 ) చూస్తే చాలు ఈ సినిమా ఎంత కామెడీ గా రూపొందిందో తెలియడానికి. చేసేది ఓవర్ యాక్షన్ అని అర్ధం అవుతున్నా కానీ వీళ్ళ ముగ్గురి టైమింగ్, యాక్టింగ్ చూసాక చూడాలి అనిపించడం లో తప్పు లేదు. కే.వి. అనుదీప్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. రాడాన్ సంగీతం లో ఈ సినిమా నుండి విడుదలైన ‘చిట్టి’ పాట కూడా బాగా ఆకట్టుకుంది. మార్చ్ 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలవనుంది.