fbpx
Monday, December 23, 2024
HomeMovie Newsతమిళ్ లో విడుదలైన C /O కంచెరపాలెం

తమిళ్ లో విడుదలైన C /O కంచెరపాలెం

CareOfKancharaPalem RemadeAs CareOfKaadhalInTamil

కోలీవుడ్: తెలుగులో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా C /O కంచెరపాలెం. దగ్గుబాటి రానా సమర్పణలో ఈ సినిమా రూపొందింది. వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. పరుచూరి ప్రవీణ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఒక చిన్న సినిమాగా విడుదలై ఒక కొత్త కథనం ద్వారా నాలుగు మంచి కథల్ని చూపించి ఆ కథల్ని కనెక్ట్ చేసే విధానం తో ఆకట్టుకున్నాడు డైరెక్టర్ వెంకటేష్ మహా.

ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ లో కూడా రూపొందింది. తమిళ్ లో ఈ సినిమా C /O కాదల్ అనే టైటిల్ తో రూపొందింది. ఈ సినిమాకి తెలుగులో స్వీకర్ అగస్తి ఇచ్చిన సంగీతం ఆకట్టుకుంది. తమిళ్ లో కూడా ఈ సినిమాకి స్వీకర్ సంగీతం అందించాడు. తెలుగు లో కార్తీక్ రత్నం పోషించిన పాత్రని తమిళ్ లో కూడా కార్తీక్ రత్నం పోషించాడు. ఈరోజు ఈ సినిమా విడుదలై అక్కడ కూడా ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular