టాలీవుడ్: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ టీజర్ మరియు విడుదల తేదీ ప్రకటించారు . పాన్ ఇండియా హీరోగా ఎదిగి తన తదుపరి సినిమా పైన అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ ఎట్టకేలకు తన నెక్స్ట్ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జులై 30 న విడుదల ఛేయనున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. పూర్తి లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఈరోజు విడుదల చేసారు. టీజర్ లో ప్రభాస్ స్పానిష్ లో హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. తన ప్రేమ రోమియో ల చచ్చే
టైపు ప్రేమ కాదని చెప్తాడు.
ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ టీజర్ విడుదల చేసి అభిమానుల్ని కుష్ చేసారు. టీజర్ ప్లెసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ లో సినిమా కాస్ట్ కనిపిస్తుంది. హీరో , హీరోయిన్ల స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం అందిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా విడుదల సస్పెన్స్ నేటితో వీడడం తో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.