టాలీవుడ్: తెలుగు దర్శకులలో శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. మధ్య తరగతి జీవితాలతో కథలని రాసుకొని మన చుట్టూ ఉండే , జరిగే విషయాలని సీన్స్ గా రాసుకుని స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటాడు. ఆయన సినిమాల్లోని కథలు మన వాళ్ళవే.. మనం చూస్తున్నవే అన్నట్టు కనిపిస్తాయి. ఎక్కువ డ్రామా, ఎక్కువ యాక్షన్ లేకుండా అద్భుతమైన ప్రేమ కథలని రూపొందించడం లో ఆయన మాస్టర్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా లవ్ స్టోరీ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ విపరీతం గా ఆదరణ పొందుతున్నాయి.
ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ‘నీ చిత్రం చూసి’ అనే పాటని విడుదల చేసారు. ఈ పాటలో హైదరాబాద్ లో ప్రేమ కథలకి నిదర్శనాలైన వివిధ కట్టడాలని రిఫరెన్స్ గా చూపించి చివరకి హీరో హీరోయిన్ల పేరుతో (రేవంత్, మౌనిక) వాళ్ళ లవ్ స్టోరీ కి మూలం అయిన హీరో కి సంబందించిన జుమ్బా డాన్స్ స్కూల్ ని చూపిస్తారు. వీళ్ళ ప్రేమ కూడా అంతలా చిరస్థాయిలా నిలిచిపోతుంది అన్నట్టు చిహ్నంగా చూపించారు. ఇంకా ఈ పాటలో అనురాగ్ కులకర్ణి గాత్రం మరియు మిట్ట పల్లి సురేందర్ సాహిత్యం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి. ఈ సినిమా నుండి వచ్చే ఒక్కో పోస్టర్, ఒక్కో పాట, ఒక్కో వీడియో ఈ సినిమా పైన అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఈ పాట కూడా అంతకి మినహాయింపేమీ కాదు. పాట మొత్తం వినిపించే పదాలు, లిరికల్ వీడియో లో చూపించే సీన్స్ మధ్య తరగతి జీవితాల్ని ప్రతిబింబించేలా, హృదయానికి హద్దుకునేలా ఉన్నాయి. ఏప్రిల్ 16 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.