టాలీవుడ్: సినిమా ప్రకటనే టైటిల్ లేకుండా, ప్రొడ్యూసర్ పేరు లేకుండా, డైరెక్టర్ పేరు లేకుండా, ఎలాంటి టెక్నిషియన్ పేరు లేకుండా సినిమా విడుదల తేదీ ప్రకటించి విడుదల తేదీ పై కర్చీఫ్ వేసినట్టు కొత్త రకంగా అనౌన్స్ చేసి తమ సినిమా గురించి మాట్లాడుకునేట్లు చేయడంలో సఫలమయ్యారు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఆ పోస్టర్ తమ సినిమాకి సంబంధించి అన్నట్టు ప్రకటించారు మారుతీ. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ప్రకటించి షూటింగ్ స్టార్టింగ్ డేట్ కూడా ప్రకటించారు.
డైరెక్టర్ మారుతీ మరియు గోపీచంద్ మొదటిసారి తమ కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. ‘పక్కా కమర్షియల్’ అనే ఈ సినిమా టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ఒకటి విడుడుదల చేసారు. సూట్ వేసుకుని సూపర్ అన్నట్టు చేతివేళ్ళతో సింబల్ చూపించారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపి చంద్ యూవీ క్రియేషన్స్ వారితో జిల్ తర్వాత రెండో సారి పని చేయనున్నారు. టాక్సీ వాలా సినిమాకి సంగీతం అందించిన ‘జేక్స్ బిజోయ్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ మర్చి 5 నుండి మొదలవబోతున్నట్టు కూడా తెలిపారు.