న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ట్విటర్ వేదికగా కేసీఆర్కు బర్త్డే విషెస్ తెలిపారు.
ప్రజాసేవ చేస్తూనే ఉండాలి: ఓం బిర్లా
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలుగులో ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలికారు. ‘కోటి వృక్షార్చన’ పేరిట గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
ఉద్యమ స్ఫూర్తితో సాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గ్రేటర్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ.