న్యూఢిల్లీ: భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ప్రోత్సాహం సందర్భంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్‌కు పెట్టింది పేరైన అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా మన దేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తమౌతోంది.
ఇదే సమయంలో హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ కార్ అయిన ఐయోనిక్ 5 వాహన టీజర్‌ను విడుదల చేసింది. సూపర్బ్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు షాక్ ఇవ్వబోతుందంటూ ఈ టీజర్‌పై చర్చ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ డిజిటల్ స్క్రీన్ సహా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు ఎల్‌ఇడి యాంబియంట్ లైటింగ్ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేస్తోంది.
మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ లో ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై లివింగ్ స్పేస్ థీమ్‌తో వస్తున్న కార్ ఇది. ఈ టీజర్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్ షోకి రెడీ అవుతున్న సందర్భంలో హ్యుందాయ్ దీన్ని విడుదల చేసింది.
ఐయోనిక్ 5 ఇంటీరియర్‌లో వాడిన మెటీరియల్ కూడా ఎకో ప్రాసెస్డ్ లెదర్‌ను వినియోగించింది. అలాగే కారు మొత్తం సహజసిద్దమైన పెయింట్, రీసైకిల్డ్ ఫైబర్ వాడారు. సీట్లను కవర్ చేసే ఈ ఎకో లెదర్‌కి తోడు అవిసెగింజల నూనె నుంచి తీసిన డైలతో పెయింట్ వేసినట్లు కంపెనీ ప్రకటించింది. కారులోని క్యాబిన్‌లో కూడా ఊలు, పాలీయార్న్ కూడా చెరకు నుంచి ఉత్పన్నమైన ఫైబర్‌ను వినియోగించింది.