బాలీవుడ్: భారత దేశ క్రికెట్ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిన ఘట్టం 1983 వరల్డ్ కప్ విన్నింగ్. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ లో ప్రధాన భూమిక పోషించిన అప్పటి టీం కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని బాలీవుడ్ లో 83 అనే సినిమా రూపొందిన విషయం తెల్సిందే. దాదాపు కరోనా కి ముందే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా లాక్ డౌన్ టైం లో ఓటీటీ ల్లో విడులవుతుంది అని చాలా సార్లు వార్తలు వినిపించాయి. మూవీ మేకర్స్ కూడా కొన్ని సార్లు దీని గురించి ఆఫీషియల్ గా థియేటర్లలోనే విడుదల చేయబోతున్నాం అని చెప్పాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా విడుదలకి సంబందించిన అప్ డేట్ విడుదల చేసింది సినిమా టీం. జూన్ 4 న ఈ సినిమాని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాని హిందీ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రూపొందించారు. ఈ సినిమాని ౩డి లో కూడా విడుదల చెయ్యబోతున్నారు. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. సౌత్ నుండి ‘జీవా‘ అప్పటి ఓపెనర్ శ్రీకాంత్ పాత్రలో నటిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఎంటర్టైన్మెంట్ మరియు కబీర్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు వర్ధన్, సాజిద్ నదియావాలా ఈ సినిమాని నిర్మించారు. కబీర్ ఖాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.