టాలీవుడ్: శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘శ్రీకారం’. మర్చి నెలలో విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుండి ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతంలో ఈ సినిమా నుండి విడుదలైన ‘వస్తానంటివో పోతానంటివో’ అంటూ సాగే పాట హిట్ గా నిలిచింది. ఈ రోజు ఈ సినిమా నుండి ‘హే-అబ్బాయి’ అంటూ సాగే టీజింగ్ పాటని విడుదల చేసారు. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీ గా ‘గ్యాంగ్ లీడర్‘ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య సాగే టీజింగ్ చూపించారు.
తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. వ్యవసాయం ఎందుకు వెనకబడింది, వ్యవసాయం వృద్ధి కోసం పాటు పడే యువకుడిగా ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బి.కిషోర్ అనే దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చ్ 11 న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇదే రోజు నవీన్ పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ కూడా విడులవుతుంది.