టాలీవుడ్: ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ఇంటి నుండి లేదా ఒకే కుటుంబం నుండి వస్తున్న స్టార్స్ పెరిగిపోతున్నారు. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మరియు మీడియం రేంజ్ హీరోలలో ఒక పది మంది బ్రదర్స్ ఉన్నారు. అక్కినేని కుటుంబం లో ఒకే ఇంటి నుండి వచ్చిన బ్రదర్స్ నాగ చైతన్య మరియు అఖిల్ ఇండస్ట్రీ లో అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరితో పాటు సుమంత్ మరియు సుశాంత్ కూడా హీరోలుగా నిలదొక్కుకోవడానికి తమ ప్రయత్నం చేస్తున్నారు. మంచు ఫామిలీ నుండి విష్ణు మరియు మనోజ్ బ్రదర్స్ ఇండస్ట్రీ లో హీరోలుగా కొనసాగుతున్నారు. విజయ్ దేవరకొండ మరియు ఆనంద్ దేవరకొండ లు ఇద్దరు రౌడీ బ్రదర్స్, కొండా బ్రదర్స్ అంటూ ఇండస్ట్రీ లో హీరోలుగా నటిస్తున్నారు.
నందమూరి ఫామిలీ నుండి జూనియర్ ఎన్ఠీఆర్ – కళ్యాణ్ రామ్, మెగా ఫామిలీ నుండి చిరంజీవి – పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ – అల్లు శిరీష్ అలాగే రామ్ చరణ్ తేజ్- వరుణ్ తేజ్ హీరోలుగా ప్రయత్నిస్తూ టాప్ రేంజ్ , మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నారు. వీళ్ళతో పాటు ఈ మధ్యనే ఉప్పెన సినిమాతో పరిచయం అయిన వైష్ణవ తేజ్ కూడా అంతకు ముందే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఇలా ఇండస్ట్రీ లో ఉన్న బ్రదర్స్ లిస్ట్ లో చేరాడు. ఇలా ఇండస్ట్రీ అంతా అన్న దమ్ముల బాక్స్ ఆఫీస్ వార్ అన్నట్టు కొనసాగుతుంది. కొన్ని రోజులు ఐతే ఒక ఫామిలీ నుండి వచ్చే సినిమాలు ఒకే రోజు లేదా ఇద్దరు ఓన్ బ్రదర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైట్ చేసుకునే రోజులు తొందర్లోనే చూడబోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.