fbpx
Wednesday, January 1, 2025
HomeMovie News'మేజర్' కి కాంపిటీషన్ గా మరొక ఆర్మీ బేస్డ్ బయోపిక్

‘మేజర్’ కి కాంపిటీషన్ గా మరొక ఆర్మీ బేస్డ్ బయోపిక్

SherShah MovieReleaseDate Announced

టాలీవుడ్: అడవి శేష్ హీరోగా ప్రస్తుతం ‘మేజర్’ అనే ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాని ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 2 న విడుదల చేస్తున్నారు. ఇదే రోజున బాలీవుడ్ నుండి మరొక ఆర్మీ మేజర్ బయోపిక్ సినిమాని కూడా విడుదల చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించారు.

సిద్దార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ నటీ నటులుగా ‘షేర్ షా’ అనే ఒక సినిమా రూపొందింది. ధర్మ ప్రొడక్షన్స్, కాశ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా , షబ్బీర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘పంజా’, తమిళ్ లో ‘బిల్లా’ సినిమాలని రూపొందించిన విష్ణువర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పరమవీర చక్ర అవార్డ్ గ్రహీత కెప్టెన్ విక్రమ్ భాత్ర జీవితకథ ఆధారంగా రూపొందింది. ఒకే తేదీ న ఇద్దరు ఆర్మీ బేస్డ్ హీరోల కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైట్ కి దిగనున్నాయి. రెండు సినిమాలు ఆకట్టుకుని రెండు సినిమాల ద్వారా చాలా మంది ఇన్స్పిరేషన్ పొందాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular