ముంబై: భారత బ్యాంకుల్లో దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బంగారంపై రుణాలను ఇకపై దాదాపు రూ.50లక్షల వరకు తీసుకోవచ్చు అని తెలిపింది. ఇంతకు ముందు కేవలం రూ.20 లక్షలు మాత్రమే అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు ఇస్తున్న దానికంటే రెట్టింపు రుణాలను పొందవచ్చు అని స్టేట్ బ్యాంక్ పేర్కొంది. గరిష్ట రుణ మొత్తం రూ.50 లక్షలు ఉంటే కనీస రుణ మొత్తం రూ.20వేలుగా నిర్ణయించింది. ఎస్‌బీఐలో బంగారం రుణాలను తీసుకోవాలనుకునేవారు 7208933143కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా జీవోఎల్డీ అని టైపు చేసి 7208933145కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు.
ప్రస్తుతం బంగారం రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే బంగారం రుణాలను ఎస్‌బీఐ అందిస్తుంది. అలాగే కాగితం పని కూడా తక్కువ ఉండనున్నట్లు తెలిపింది. బంగారు నాణేలతో సహా బంగారు ఆభరణాలపై ఎస్‌బీఐ బంగారు రుణాన్ని పొందవచ్చు.
దీనితో పాటుగా బంగారు రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. బంగారం రుణాలను 18 సంవత్సరాల పైబడిన వారు తీసుకోవచ్చు. రుణం కోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది.