హైదరాబాద్: పదవ తరగతి బోర్డు పరీక్షలపై సస్పెన్స్ కు తెర దించుతూ, చివరికి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న మధ్యాహ్నం సిఎం కెసిఆర్ విద్యా శాఖ అధికారులు, మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలతో సమావేశం నిర్వహించారు. పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసిన పలు రాష్ట్రాల గురించి అధికారులు కెసిఆర్‌కు సమాచారం అందించారు.
అనేక రాష్ట్రాల విధానాన్ని అధ్యయనం చేసి అనేక అంశాలను చర్చించిన తరువాత ప్రస్తుత పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడం ప్రమాదకరమని మరియు వారిని ప్రమోట్ చెయ్యటం ఉత్తమ ఎంపిక అని కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో 5,34,903 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
అయితే విద్యార్థులకు గ్రేడింగ్ ఎలా ఇస్తారో అన్న విషయం ఇప్పుడు పెద్ద తలనొప్పి గా మారింది . ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ కేటాయించనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇంతలో డిగ్రీ మరియు పిజి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి కొంత సమయం పడుతుంది.