కోలీవుడ్: నేనే అంబానీ, రాజా రాణి సినిమాల ద్వారా తెలుగులో కూడా కొంచెం గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో తెలుగు లో విలన్ గా కనిపించాడు. ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు సినిమా మళ్ళీ చెయ్యలేదు కానీ డబ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని కూడా పలకరించాడు. ప్రస్తుతం ఆర్య ‘టెడ్డీ’ అనే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది.
ఒక మనిషి ఆత్మ టెడ్డీ బేర్ లో చేరి సమాజంలో జరుగుతున్న ఒక మెడికల్ మాఫియా పై చేసే పోరాటంలో హీరో తో పాటు ఫైట్ చేయించడం అనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందించారు అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. సినిమా లైన్ కొత్తగా అనిపించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆర్య కి జోడీ గా తన నిజ జీవిత భాగస్వామి సాయేషా నటిస్తుంది. టెడ్డీ బేర్ ఈ సినిమా ఒక ముఖ్య పాత్ర పోషించడం ఆ కారెక్టర్ నే టైటిల్ గా పెట్టడం ఆసక్తి కలిగిస్తుంది.
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే.ఇ.జ్ఞానవేల్ రాజా, ఆధనా జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మించారు
ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 12 నుండి హాట్స్టార్ ఓటీటీ లో అందుబాటులో ఉండబోతుంది.