టాలీవుడ్: కీరవాణి రెండవ తనయుడు ‘శ్రీ సింహ‘ హీరోగా ‘మత్తు వదలరా’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఒక కొత్త రకమైన అట్టెంప్ట్ గా మంచి ప్రశంసలు పొందింది. తన రెండవ సినిమా గా ‘తెల్లవారితే గురువారం’ అనే ఒక ఫామిలీ ఎంటర్టైనర్ ని రూపొందించి విడుదలకి సిద్ధం చేసాడు. ప్రస్తుతం తన మూడవ సినిమాని మరో పెద్ద బ్యానర్ లో ప్రకటించి సినిమాల విషయం లో దూకుడు చూపిస్తున్నాడు ఈ యువ హీరో. శ్రీ సింహ హీరోగా ‘భాగ్ సాలె’ అనే సినిమా రూపొందనున్నట్టు టైటిల్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ మరియు బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తన సోదరునికి కీరవాణి మొదటి కుమారుడు ‘కాల భైరవ’ ఈ సినిమాకి మరోసారి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. అలాగే మార్చ్ లో శ్రీ సింహ రెండవ సినిమా కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.