టాలీవుడ్: యంగ్ హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా ‘రంగ్ దే’. తొలి ప్రేమ, మజ్ను సినిమాలకి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి ‘బస్టాండే బస్టాండే’ అంటూ సాగే పాట విడుదలైంది. పెళ్లి అయిన తర్వాత భర్త పడే కస్టాలు అంటూ ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. రొమాంటిక్ గా ఫన్నీ గా సాగే ఈ పాట లిరికల్ వీడియో లో కీర్తి సురేష్, నితిన్ ఆకట్టుకున్నారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో రూపొందిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. సీనియర్ అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ పనితనం ఈ సినిమాకి మరో ఆకర్షణగా నిలవనుంది. పూర్తి ఫామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లాగా రూపొందిన ఈ సినిమా మార్చ్ 26 న థియేటర్లలో విడుదల అవనుంది. మొన్నే చెక్ సినిమాతో పలకరించిన నితిన్ మార్చ్ లో రంగ్ దే మరో మూడు నెలల తర్వాత ‘అందాదున్’ రీ-మేక్ తో రాబోతున్నాడు.