టాలీవుడ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని క్రేజీ డైరెక్టర్స్ తో మోస్ట్ అవైటెడ్ మూవీస్ తీస్తున్నాడు. కే.జి.ఎఫ్ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాని 2022 సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ప్రకటించింది సినిమా టీం. 2022 ఏప్రిల్ 22 న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా షూటింగ్ నిమిత్తం గోదావరి ఖని కోల్ మైన్స్ లో కొద్దీ రోజులు షూటింగ్ కూడా చేసారు. ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఈ సంవత్సరం సమ్మర్ లో రాధే శ్యామ్ ని విడుదలకి సిద్ధం చేసాడు. వచ్చే సంవత్సరం లో సలార్ తో పాటు ఆదిపురుష్ అనే మరో సినిమాని కూడా సిద్ధం చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో నటించబోతున్నాడు. వీటితో పాటు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో అద్భుతమైన సినిమాని లైన్ లో పెట్టి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.