టాలీవుడ్: తెలుగులో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో క్లాస్ సినిమాలు రూపొందించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. మిడిల్ క్లాస్ లైఫ్ లలో జరిగే కథల్ని , సన్నివేశాల్ని ప్రతిబింబించేలా సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సమ్మర్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నుండి ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. ఈ రోజు ‘సారంగా దరియా’ అంటూ సాగే పాటని సమంత విడుదల చేసారు.
ఇంతకముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ సినిమా నుండి ‘వచ్చిండే’ పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ రోజు విడుదలైన ‘సారంగా దరియా’ పాట కూడా యు ట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది. ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటని మంగ్లీ ఆలపించింది. పవన్ సి.హెచ్ ట్యూన్ ట్యూన్ లో , శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో లిరికల్ వీడియో లో సాయి పల్లవి స్టెప్స్ అబ్బురపరిచాయి. అమిగోస్ క్రియేషన్స్ మరియు ఏషియన్ మూవీస్ నిర్మాణంలో సునీల్ నారంగ్ , రామ్మోహన్ ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 16 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.