దుబాయ్: జనవరి 2021 చివరి వారంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన కొత్త అవార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. ఈ అవార్డు మూడు రకాల ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అందివ్వడం జరుగుతుంది. పురుషులతో పాటు మహిళ క్రికెటర్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.
ఆ ముగ్గురిలో టీమిండియాకు చెందిన ఆల్‌రౌండర్ అశ్విన్ ఉండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నారు. ఐసీసీ అధికారక వెబ్‌సైట్ ద్వారా అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఓటింగ్ ఆధారంగా మార్చి 8న అవార్డు ఎవరికి వరిస్తుందో తెలుస్తుంది.
రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్‌లో అధ్బుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసాడు. ఆ టెస్టులో అశ్విన్ 106 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లోనూ 8 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మేయర్స్ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో(210 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈ ఫీట్‌ను మేయర్స్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం. వీరితో పాటు మహిళా క్రికెటర్లలో ఇంగ్లండ్ నుంచి టామీ బ్యూమాంట్ ,నాట్ సైవర్, బ్రూక్ హిల్లాడే( న్యూజిలాండ్) ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యారు.