దుబాయ్: జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే జట్టు ఆఫ్గనిస్తాన్‌ను రెండు సార్లు ఔట్ చేసి రెండు రోజుల్లోనే తొలి టెస్ట్ మ్యాచ్‌ను తన సొంతం చేసుకుంది. అయితే చాలాకాలం తర్వాత టెస్టుల్లో జింబాబ్బే చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ సీన్ విలియయ్స్ (105 పరుగులు) సెంచరీతో ఆకట్టుకోవడం, రజా 43, చకాబ్వా 44 పరుగులతో అతనికి సహకరించారు. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
తదుపరి రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్గానిస్తాన్ జింబాబ్వే బౌలర్ల దాటికి మళ్ళి 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 17 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించిన జింబాబ్వే అద్బుతమైన టెస్టు విజయాన్ని నమోదు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఓవరాల్‌గా రెండో రోజు రెండు జట్లవి కలిపి ఆటలో 15 వికెట్లు నేలకూలడం విశేషం. అయితే మొటేరా వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కూడా రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తీవ్ర దుమారాన్ని రేపి అందరి దృష్టిని ఆకర్షించింది.