fbpx
Friday, October 18, 2024
HomeTelanganaఐసెట్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ విద్యా మండలి

ఐసెట్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ విద్యా మండలి

TELANGANA-ICET-SCHEDULE-RELEASED-BY-HIGHER-EDUCATION

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఐసెట్ కు సంబంధించిన‌ షెడ్యూల్‌ (2021-22)ను ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం నాడు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ఐసెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ సంవత్సరం ఏప్రిల్‌ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా పరీక్షకు రుసుమును 650 రూపాయలుగా నిర్ణయించింది. ఏ అపరాధ రుసుము లేకుండా జూన్‌ 15 వరకు అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

అపరాధ రుసుముల వివరాలు: జూన్ 30 వరకు-250 రూపయల అపరాధ రుసుముతో, జులై 15 వరకు-500 రూపాయల అపరాధ రుసుముతో, మరియు జూలై 30వ తేదీ వరకు-1000 రూపాయల వరకు అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.

ఐసెట్ పరీక్షను ఆగస్టు నెలలో మూడు సెషన్‌లలో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే ఈ పరీక్షను కేవలం అన్‌లైన్‌ ద్వారా మాత్రమే నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం విద్యాశాఖ ఐసెట్‌ ప్రతి సంవత్సరం ఐసెట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular