fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshజానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

A – case -of- sexual- harassment- against -Tollywood’s- famous -choreographer- Johnny Master

టాలీవుడ్‌: టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో పాపులారిటీని సంపాదించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో, జానీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జనసేన స్పందన:
ఈ వివాదం నేపథ్యంలో, జనసేన పార్టీ తాత్కాలికంగా జానీ మాస్టర్‌ను పార్టీ కార్యక్రమాల నుంచి తప్పించింది. గత ఎన్నికల సమయంలో ఆయన జనసేనలో చేరి ప్రచార బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. జనసేన ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్న జానీ మాస్టర్‌ పేరును రేప్ కేసులో వినిపించడం తోపాటు, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని జనసేన అధినేత వేములపాటి అజయ్ కుమార్ ప్రకటించారు. ఆయన తక్షణమే పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించారు.

కేసు వివరాలు:
వివరాల్లోకి వెళ్తే, బాధిత యువతి తన ఫిర్యాదులో 2017లో ‘ఢీ’ షో ద్వారా జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. 2019లో జానీ టీంలో అసిస్టెంట్‌గా చేరి, ముంబైలో ఓ షో కోసం వెళ్ళిన సమయంలో హోటల్లో జానీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే తనను బెదిరించాడని, ఇక షూటింగ్ సమయంలో చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు వివరించింది.

పోలీసు చర్యలు:
రాయదుర్గం పోలీసులు ఈ కేసులో జానీ మాస్టర్‌పై అత్యాచారం, వేధింపులు ఆరోపణల కింద 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

టాలీవుడ్‌ లో నిరాశ:
టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కి కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో సినీ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “అల వైకుంఠపురంలో” బుట్ట బొమ్మ సాంగ్‌తో పాటు “పుష్ప”లోని “శ్రీవల్లీ” సాంగ్, “బీస్ట్”లో “అరబిక్ కుత్తు” వంటి సాంగ్స్‌తో జానీ మాస్టర్‌ కి భారీ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం రాంచరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమాకు జానీ మాస్టర్‌ పని చేస్తుండగా ఈ ఆరోపణలు రావడంతో టాలీవుడ్‌లో చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular