fbpx
Saturday, January 18, 2025
HomeInternationalజపాన్‌లో మనుషుల కోసం ప్రత్యేక వాషింగ్‌ మెషిన్!

జపాన్‌లో మనుషుల కోసం ప్రత్యేక వాషింగ్‌ మెషిన్!

A-SPECIAL-WASHING-MACHINE-FOR-HUMANS-IN-JAPAN!

అంతర్జాతీయం: జపాన్‌లో మనుషుల కోసం ప్రత్యేక వాషింగ్‌ మెషిన్!

మనుషులను ఉతికి ఆరేసే వాషింగ్ మెషిన్ తయారుచేసి జపాన్ మరోసారి ఆవిష్కారంలో ముందంజ వేసింది. ఒసాకా కేంద్రంగా ఉన్న “సైన్స్ కో” సంస్థ ఈ వినూత్న హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ను రూపొందించింది. కేవలం 15 నిమిషాల్లో వ్యక్తిని శుభ్రపరిచే ఈ మెషిన్, ఫైటర్ జెట్ కాక్‌పిట్‌ను పోలి ఉంటుందని సంస్థ చెబుతోంది.

ఎలా పనిచేస్తుంది?

  1. పారదర్శకమైన ప్లాస్టిక్ క్యాప్సుల్ వంటి ఈ పాడ్‌లో వ్యక్తి ప్రవేశించగానే, అది గోరువెచ్చని నీటితో నిండుతుంది.
  2. హెస్పీడ్ జెట్స్ ద్వారా నీటిని శరీరంపై వేగంగా ప్రక్షేపిస్తాయి.
  3. నీటిలో మూడు మైక్రోమీటర్ల పరిమాణంలోని సూక్ష్మ బుడగలు ఉంటాయి. ఇవి శరీరంలోని మురికిని తొలగిస్తాయి.
  4. ఈ యంత్రం కేవలం శుభ్రత మాత్రమే కాకుండా, మసాజ్ బాల్స్ ద్వారా శరీరానికి నయం కలిగిస్తుంది.

మానసిక ఉల్లాసానికి ప్రత్యేక డిజైన్

  • కృత్రిమ మేథ (AI) సహాయంతో, పాడ్ వ్యక్తి మానసిక స్థితిని అంచనా వేస్తుంది.
  • వ్యక్తి పరిస్థితికి అనుగుణంగా, పాడ్‌లో ప్రత్యేక వీడియోలు ప్రసారం చేస్తుంది, తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

పాత డిజైన్, నూతన ఆవిష్కరణ
ఈ యంత్రం సరికొత్తగా కనిపించినా, దీని డిజైన్ 50 ఏళ్ల క్రితం నుంచే ఉంది. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో శానియో ఎలక్ట్రిక్ కో (ప్రస్తుతం పానసోనిక్) ఈ మెషిన్‌ను తొలిసారి పరిచయం చేసింది. ఇప్పుడు, అత్యాధునిక మార్పులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

ప్రదర్శనకు సిద్ధం
ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ను మొదటగా ఒసాకా కన్సాయి ఎక్స్‌పోలో పరీక్షిస్తారు. 1,000 మంది అతిథులు దీనిని ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నారు. ప్రదర్శన విజయవంతమైతే, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular