అట్లీ-బన్నీ కలయిక: బిగ్ ప్లాన్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘#AA22xA6’ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాకే కొత్త దిశగా నిలవబోతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా ఏంటి అన్న ఉత్కంఠకు సన్ పిక్చర్స్ విడుదల చేసిన ప్రోమో ముగింపు పలికింది. ఇది ఓ సాధారణ సినిమా కాదని, నెవ్వర్ బిఫోర్ లెవెల్‌లో తెరకెక్కుతోందని స్పష్టమవుతోంది.
లాస్ ఏంజెల్స్‌లో ఉన్న టాప్ వీఎఫ్ఎక్స్ సంస్థలతో బన్నీ, అట్లీ నిర్వహించిన చర్చలు ప్రాజెక్ట్ గ్రాండ్ స్కేల్‌ను అర్థమయ్యేలా చేశాయి. అవతార్, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో పనిచేసిన నిపుణులు బన్నీ కథను మెచ్చుకోవడం విశేషం. ఇప్పటివరకు మన టాలీవుడ్‌లో ఈ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ జరగలేదు.
‘కల్పన-ఆవేశం కలయిక’, ‘సరిహద్దులు దాటి కొత్త లోకాలు’ అనే ట్యాగ్‌లతో ఈ సినిమా స్వరూపం మరోలెవెల్‌లో ఉంది. 3D, అడ్వాన్స్ గ్రాఫిక్స్, జంతువులపై వర్చువల్ సీన్స్ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఆస్కార్ విజేతల సాయంతో సినిమా నిర్మాణం జరుగుతోందంటే హైప్ మామూలుగా లేదు.
ఈ ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుండగా, 2026లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బన్నీ, అట్లీ, కలానిధి మారన్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా.