టాలీవుడ్: కరోనా టైం లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల్ని తమ తమ ఊళ్ళకి చేర్చడం లో ముఖ్య పాత్ర పోషించి అందరి ప్రశంసలు పొందుతూ అక్కడి నుండి ప్రతీ చోట ఎదో ఒక విధంగా తన వంతుగా సాయం చేస్తూ ఇంకా కొందరి దగ్గరి నుండి నిధులు సేకరిస్తూ ఆపదలో ఉన్న వాల్లకి తన వంతు సహాయం చేస్తున్నాడు సోనూ సూద్. సోనూ సూద్ సేవలు గుర్తించి అతను పుట్టిన రాష్ట్రం పంజాబ్ ఆ రాష్రానికి స్టేట్ ఐకాన్ గా కూడా ప్రకటించింది. ఎప్పటినుండో తెలుగులో కూడా రక రకాల పాత్రలు చేస్తూ అలరిస్తున్న సోనూ సూద్ కరోనా తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాల్లో ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ అవుతున్నాడు.
ఈ మధ్యనే షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టిన మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూట్ కి కూడా వచ్చాడు. షూట్ కి రాగానే సినిమా టీం సోనూ సూద్ కి గౌరవ సత్కారం చేసి అభినందించింది. సోనూ సూద్ ఎలాంటి సొంత ఉదేశ్యం లేకుండా ఇలా చేయడం అందరికి ఇన్స్పిరేషనల్ గా ఉందని ఇది ఇలాగే కొనసాగి చాలా మంది సోనూ సూద్ బాటలో వెళ్లాలని ఆశిస్తూ టీం అంతా సోనూ సూద్ కి సత్కారం చేసి సెట్ కి ఆహ్వానించింది. సినిమా డైరెక్టర్ ‘కొరటాల శివ‘ అలాగే మరో విలక్షణ నటుడు ‘తనికెళ్ళ భరణి’ సెట్ లో సోనూ సూద్ ని సత్కరించారు.