కోలీవుడ్: తెలుగు లో ‘పెదరాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘రవి రాజా పినిశెట్టి’ కుమారుడు ఆది పినిశెట్టి. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలు వేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్ మరియు తెలుగు లో రెండు భాషల్లో మంచి మంచి పాత్రలు వేస్తూ అలరిస్తున్నాడు. నిన్ను కోరి, రంగస్థలం సినిమాల తర్వాత ఆది క్రేజ్ తెలుగులో కూడా బాగా పెరిగింది. ఇపుడు ఆది సినిమా అంటే మినిమమ్ కొన్ని అంచనాలు ఉంటున్నాయి. ఆది కూడా అలంటి క్యారెక్టర్లే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇపుడు ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
తమిళ్ లో క్లాప్ అనే సినిమా లో ఆది హీరోగా నటించాడు. కరోనా తర్వాత షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ మధ్యనే కంప్లీట్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్ మూవీ గా రూపొందుతుంది. మళ్ళీ రావా , దేవా దాస్ లాంటి సినిమాల్లో నటించిన ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో ఆది కి జోడి గా నటించింది. మరో ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. 65 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దీనికి సంబందించిన ఒక వీడియో షేర్ చేసి సినిమా టీం సెలెబ్రేట్ చేసుకున్నారు. రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ బ్యానర్ పై రామాంజనేయులు , రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.