టాలీవుడ్: తెలుగు లో పెదరాయుడు లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు రూపొందించిన డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి. తమిళ్ లో హీరో గా చేస్తూనే కొన్ని డబ్ సినిమాలతో ఇక్కడ పేరు సంపాదించాడు. సమయం వచ్చినపుడు ఇక్కడ తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ఇమేజ్ పెంచుకుంటున్నాడు. గుండెల్లో గోదారి, నిన్ను కోరి లాంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటించాడు. అజ్ఞాతవాసి లో , సరైనోడు సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. సరైనోడు సినిమాలో ఆది పోషించిన వైరం ధనుష్ పాత్రకి ఆది కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ నటుడు తెలుగులో మరో సినిమాలో మంచి అవకాశం దక్కించుకున్నాడు.
ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక క్రేజీ యాక్షన్ మూవీ లో నటించనున్నాడు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా ఆది ని ఎంచుకున్నట్టు ఈరోజు ప్రకటించారు. సరైనోడు తర్వాత విలన్ గా చేయాలంటే ఎదో కొత్తగా ఉండాలి అనిపించింది.. ఈ సినిమాలో విలన్ పాత్ర స్పెషల్ గా ఉందని అందుకే విలన్ గా చేస్తున్నట్టు ఆది తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో ఈ సినిమా రూపొందనుంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా టీం షూటింగ్ కూడా వేగం గా జరుపుకుంటుంది.