టాలీవుడ్: సాయి కుమార్ వారసుడిగా వచ్చిన ఆది సాయికుమార్ ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ’ అంటూ మొదటి రెండు సినిమాలతో హిట్ లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోయారు కానీ సినిమాలు మాత్రం ఎక్కడా ఆగలేదు. ప్రస్తుతం ‘కిరాతక’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో ఆది కి జోడీ గా RX100 ఫేమ్ పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తుంది.
అల్లరి నరేష్ తో ఆహ నా పెళ్ళంటా, నాగార్జున తో భాయ్, ఆది తోనే చుట్టాలబ్బాయి సినిమాల్ని డైరెక్ట్ చేసిన వీరభద్రం ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతుంది. వీరభద్రం మొదటి సారి ఈ జానర్ సబ్జెక్ట్ ని రూపొందిస్తున్నాడు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లలో సీరియస్ గా చూస్తున్న ఆది లుక్ ఒకటి మరియు హీరోయిన్ పాయల్ రాజపుత్ తో ఉన్న లుక్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం. విజన్ సినిమాస్ బ్యానర్ పై మాస్టర్ నాగం జెశ్విన్ రెడ్డి సమర్పణలో నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యనే మొదలైన ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.