టాలీవుడ్: తమ స్వరం తోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ ఫ్యామిలి నుండి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ‘ఆది‘. కెరీర్ ప్రారంభం లో వచ్చిన ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ ‘ తప్ప మరే సినిమాలు కూడా అంతగా ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఇపుడు వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ‘జంగిల్‘ టీజర్ ఆకట్టుకుంది. ఈరోజు ‘ఆది సాయికుమార్’ పుట్టిన రోజు సందర్భంగా ఆది నటిసున్న మరొక సినిమా ‘శశి’ కి సంబందించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ని మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ టీజర్ ని విడుదల చేసి చిరంజీవి ఈ సినిమా టీం కి బెస్ట్ విషెస్ తెలియచేసారు.
టీజర్ లో ఆది రెండు షేడ్స్ లో కనిపించాడు. కాలేజ్ స్టూడెంట్ గా లవర్ బాయ్ రోల్ ఒకటి మరొకటి కొంచెం రగ్గడ్ లుక్ తో ఉన్నాడు. ఒకటి ప్రస్తుతం మరొకటి ఫ్లాష్ బ్యాక్ రోల్ అయ్యి ఉండొచ్చు. బాగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాక ఆ ప్రేమికుడు తీర్చుకునే రివెంజ్ కథ అన్నట్టు టీజర్ ద్వారా ఒక అంచనా వెయ్యొచ్చు. అలా అని టీజర్ ని బట్టి కథని పూర్తిగా అంచనా వెయ్యలేం. ఈ సినిమాలో ఆది కి జోడి గా సురభి నటిస్తుంది. చాలా రోజుల తర్వాత సురభి ఈ సినిమాలో కనిపిస్తుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ ,సి.రామాంజనేయులు ,చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ నాయుడు నడికట్ల అనే నూతన దర్శకుడు పరిచయం అవబోతున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకొని మరి కొన్ని రోజుల్లో విడుదల అవడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది.