టాలీవుడ్: సాయి కుమార్ నట వారసుడిగా ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ’ లాంటి సినిమాలతో కెరీర్ మంచిగానే ప్రారంభించాడు ఆది సాయి కుమార్. తర్వాత సినిమాలని హిట్ లుగా మలచడంలో విఫలం అయ్యాడు. అయినా కూడా ఈ హీరో ఎక్కడా ఆగిపోలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యనే శశి అనే సినిమాతో పరాజయం చూసాడు. ప్రస్తుతం కామెడీ సినిమాల డైరెక్టర్ ‘వీరబద్రం’ డైరెక్షన్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఈ రోజు చేసారు.
ఈ సినిమాని ‘కిరాతక’ అనే టైటిల్ తో రూపొందించనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో ఆది కి జోడీ గా ‘RX100 ‘, ‘వెంకీ మామ’ సినిమాల్లో నటించిన ‘పాయల్ రాజ్ పుత్’ హీరోయిన్ గా నటించనుంది. ఆది తో వీరభద్రం ఇదివరకే చుట్టాలబ్బాయి అనే సినిమా రూపొందించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి ఈ సినిమాని నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నట్టు ఈరోజు ప్రకటించారు.
https://twitter.com/baraju_SuperHit/status/1407195209822183431