fbpx
Saturday, February 22, 2025
HomeMovie Newsఆది హీరోగా 'అమరం' షూట్ షూరూ

ఆది హీరోగా ‘అమరం’ షూట్ షూరూ

AadiSarikumar Amaran MovieShootStart

టాలీవుడ్: సాయి కుమార్ వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ప్రేమకావాలి అనే సినిమాతో పరిచయం అయ్యి హిట్ సాధించాడు ఆది. ఆ తర్వాత ‘లవ్ లీ’ అనే మరో ప్రేమ కథ తో మరో మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా ప్లాప్ లు పలకరించాయి. ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరో ఈ మధ్యనే ‘శశి’ అనే మరో సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్నాడు. వరుస ప్లాప్ లు ఉన్న కూడా ఈ హీరో వరుసగా సినిమాలని సెట్ చేస్తూ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది హీరోగా ఈ రోజు మరో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

‘అమరన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఉయ్యాలా జంపాల తో సినిమాతో హీరోయిన్ గా తన జర్నీ స్టార్ట్ చేసిన ‘అవికా గోర్’ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో తెలుగులో కనపడనుండి. ఈ అమ్మాయి పూర్తి స్లిమ్ లుక్ లోకి మారిపోయి ఈ సినిమాతో వరుస ఆఫర్లు కొట్టడానికి ట్రై చేస్తుంది. జెమినీ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘అమరన్ – ఇన్ ది సిటీ చాప్టర్ -1 ‘ ఎన్టీ టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ఎస్‌.బల‌వీర్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular