కోలీవుడ్: తమిళ్ హీరో సూర్య కి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత తమిళ్ హీరో కి ఈ జనరేషన్ లో మళ్ళీ కొంత క్రేజ్ సూర్య కే ఉంది. గజినీ ముందు వరకు సూర్య చాలా సినిమాలే చేసినా గజినీ సినిమా నుండి సూర్య దశ మారిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అప్పటినుండి సూర్య వెనుదిరగలేదు. మధ్యలో ప్లాప్ లు వచ్చిన కూడా సినిమాలు, ప్రయోగాలు ఎక్కడ ఆగలేదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’ అనే మూవీ తాలూకు ‘కాటుక కనులే’ పాట వీడియో ప్రోమోను గురువారం విడుదల చేశారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోమోను విడుదల చేశారు.
ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే సూర్య ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈరోజు (జూలై 23న) సూర్య పుట్టినరోజును పురష్కరించుకుని ఈ సినిమాలోని ‘కాటుక కనులే’ అనే పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు.జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన ఆహ్లాదకరమైన బాణీకి భాస్కరభట్ల తన కలంతో మరోసారి సుమధురమైన సాహిత్యాన్ని అందించారు.ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్, శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహన్‌బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.